EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు-పర్వతగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు

    జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు-పర్వతగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , ఆగష్టు 22 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడడం పర్వతగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో సాంకేతిక విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి ఎస్బిటెట్ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకు వస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటిఐ- ఏ టి సి లతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు వారం రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. నిరుపేద , పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే పాలిటెక్నిక్ లో చేరి డిప్లమా పూర్తి చేసి ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో చేరుతారని లేదా ఉద్యోగాలు చూసుకుంటారన్నారు. పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యావ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత పెంచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులలో అనుసంధానం చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. న్యాయమైన డిమాండ్స్ సాధనకై విద్యార్థులు ఆందోళన బాట పడితే సమస్యలను పరిష్కరించే బదులు పోలీసుల ఉసిగొలిపి దారుణంగా కొట్టించడమేంటని ప్రశ్నించారు. మహబూబాబాద్ లో విద్యార్థి గొంతును సిఐ పిసకడం, హైదరాబాదులోకూర్చున్న విద్యార్థి కాలుపై పోలీస్ బైక్ నడిపించి కాలు విరగొట్టడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దమన కాండ ఆపాలని, కిరాతకంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కోర్సులను ఇంజనీరింగ్ విద్యకు అనుసంధానిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పేరుతో డిప్లమా విద్యను డీగ్రేడ్ చేసే విధానాలను తీసుకురావడం రావడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాట మాడకుండా పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు విద్యా నిపుణులతో సమగ్రంగా చర్చించి సత్వరమే తగిన నిర్ణయాలు తీసుకోవాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని, లేనిచో విద్యార్థుల సమ్మె ఉధృతమయితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు హెచ్చరించారు.

    జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు-పర్వతగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు - Additional Image