EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుట్టుశిక్షణ ముగించుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన-- చిప్ప వెంకటేశ్వర్లు నేత

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Aug 2026, 08:26 PM | TELANGANA, వరంగల్
    కుట్టుశిక్షణ ముగించుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన-- చిప్ప వెంకటేశ్వర్లు నేత

    ఈ రోజు కొత్తవాడలో ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణ కార్యక్రమం లో భాగంగా మొదటి బ్యాచ్ మహిళలకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ 3150 ప్రాజెక్ట్ చైర్మన్ బేతి అశోక్ బాబు, 23 వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ రోజు సర్టిఫికేట్స్ పంపిణీ చెయ్యడం జరిగింది. మహిళలకు ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం ద్వారా ఆర్థిక వెసలు బాటు కలిగి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. ఆర్గనైజర్లు గజ్జెల కావ్య, ఆడెపు శిరీష, చిప్ప కావ్య లు మాట్లాడుతూ సెంటర్ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేసిన చిప్ప వెంకటేశ్వర్లు గారికి వారికి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ 3150 సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 100 మంది మహిళలలు శిక్షణ పూర్తి చేసుకుని ఉపాధి పొందుతున్నారని తెలిపారు.