EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళా సంఘాల వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Aug 2026, 06:40 PM | TELANGANA, జయశంకర్ భూపాలపల్లి
    మహిళా సంఘాల వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

    గోరుకొత్తపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన వీవో (VO) భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు.
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు.
    వీవో భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
    ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఎంపీడీవో సురేష్, మార్కెట్ చైర్మన్ గుంటోజ్ కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ సాయిని విజయముత్యం, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞాన్ రావు, కోటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, కాంగ్రెస్ నాయకులు మోడెం ఉమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్, సర్పంచ్ పల్లెబోయిన బిక్షపతి, ఉపసర్పంచ్ తోట సారంగపాణి, గ్రామ కమిటీ అధ్యక్షుడు అల్లే దేవేందర్, మహిళా సంఘాల మండల అధ్యక్షురాలు లడే శోభ తదితరులు పాల్గొన్నారు.
    ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.