EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • DCEB నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా వసూలు.. విద్యార్థుల నుంచి రూ.150 చొప్పున వసూళ్లు

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Aug 2026, 06:48 PM | TELANGANA, హన్మకొండ
    DCEB నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా వసూలు.. విద్యార్థుల నుంచి రూ.150 చొప్పున వసూళ్లు

    హనుమకొండ: హనుమకొండ లస్కర్ బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ (DCEB) నిర్ణయించిన ఫీజు కంటే విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి.
    9, 10వ తరగతి విద్యార్థుల నుంచి DCEB నిర్ణయించిన ప్రకారం ఒక్కొక్కరి వద్ద రూ.110 వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.150 చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.40 అదనంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
    నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అదనపు వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    DCEB నిర్ణయించిన ఫీజులనే పాఠశాలల్లో వసూలు చేసేలా అధికారులు పర్యవేక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.