EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ నగరంలో అస్తవ్యస్త పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Aug 2026, 10:43 AM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    వరంగల్ నగరంలో అస్తవ్యస్త పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు

    వరంగల్ నగరంలో ఉదయం వేళ టిఫిన్ సెంటర్లు, హోటళ్ల వద్ద అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. హోటళ్లకు వచ్చే కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్డుపై వాహనాలను నిలిపివేయడంతో ఇతర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    ముఖ్యంగా ఉదయం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. హోటల్ నిర్వాహకులు తమ సిబ్బందిని లేదా వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేసి, వినియోగదారుల వాహనాలను క్రమబద్ధంగా పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు కూడా రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి, అస్తవ్యస్త పార్కింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.