EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ రాష్ట్రం కోసం పరితప్పించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి.

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Aug 2026, 04:12 PM | TELANGANA, వరంగల్
    తెలంగాణ రాష్ట్రం కోసం పరితప్పించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి.

    *ఎప్పటికి ఏది శాశ్వతం కాదు.. మంచితనం, పేరు మాత్రమే శాశ్వతం...*
    *ఆయన పోరాటం ఎప్పటికి చిరస్మరణియం...*

    *మెడికల్ కాలేజీకీ పెద్ది సుదర్శన్ నామకరణం చేస్తాం, వారి కాంస్య విగ్రహాన్ని నెలకోల్పుతాం...*

    *ప్రతి నియోజకవర్గంలో వారి విగ్రహం పెట్టి వారిని గౌరవించుకుందాం..*

    తేది:27.08.2026
    భూపాలపల్లి జిల్లా.


    ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ నాయకుడి ఉద్యమ బాటలో అలుపెరగని పోరాటం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.

    ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,మాజీ లోక్ సభా సభ్యుడు బోయినిపల్లి వినోద్ కుమార్ గారు,భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

    *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...*

    పెద్ది మరణించిన రోజున హరీష్ రావు గారు, కేటీఆర్ గారే కాదు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న మాజీ మంత్రులు, నాయకులు అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. అది చూస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి, చాలా బాధగా అనిపించింది.

    ఆ రోజు పెద్దలు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్ట మొదటి ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కేసీఆర్ గారు ఎంతో బాధపడ్డారని చెప్పారు. అయ్యో పెద్ది ఓడిపోయాడే, అయ్యో పెద్ది ఓడిపోయాడే అని కేసీఆర్ గారు అన్నారని గుర్తు చేశారు.

    ఇవి కూడా చదవండి

    ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గెలిచి ఉంటే, బహుశా మంచి స్థానంలో ఉండి మంత్రిగా కూడా సేవలందించే అవకాశం వచ్చి ఉండేదేమో అని మాకు అనిపించింది. తర్వాత మేమంతా కలిసి మాట్లాడుకున్నాం. అందరూ ఎంతో ఆత్మీయంగా, మంచిగా మాట్లాడుకోవడం జరిగింది.

    ఏది ఏమైనా, ఈ రోజు పార్టీ మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలిచింది. కేసీఆర్ గారు స్వయంగా హాస్పిటల్‌కు రావడం, అదే విధంగా నల్లబెల్లికి వచ్చి దాదాపు అరగంట పాటు ఎంతో గంభీరమైన మౌనంతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గడపడం మనం చూశాం.

    అదే విధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇతర నాయకులందరూ కూడా వచ్చి ఒక కుటుంబ సభ్యుడికి ఏ విధంగా అండగా నిలుస్తామో, అంతకంటే ఎక్కువగా పార్టీ వారి కుటుంబానికి అండగా నిలిచిందని మనమందరం చూశాం.

    దానిని మనమందరం గుర్తుంచుకొని ముందుకు సాగాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయం ఏమిటో అందరూ చక్కగా వివరించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే మనమందరం కలిసి పని చేద్దాం.

    ఎందుకంటే ఈ రోజు ఎవరు ఏ కర్తవ్యంలో ఉన్నారో, ఆ కర్తవ్యాన్ని వంద శాతం నిబద్ధతతో నిర్వర్తించాలి. ఆ బాధ్యతలో ఉండి ఇటు అటు వెళితే, మనకు సమంజసమైన స్థానం దక్కదు.

    ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇంతటి ప్రజాభిమానం లభించిందంటే, ఆయన తన కమిట్‌మెంట్‌తో, నిబద్ధతతో ప్రజల కోసం పని చేశారు కాబట్టే. అందుకే ప్రజల హృదయాల్లో ఇంతటి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

    కాబట్టి మనమందరం కూడా పార్టీ కోసం నిబద్ధతతో పని చేయాలి. సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు ఈసారి అనవసరంగా ఓడించిండ్రు. ఆ రేవంత్ రెడ్డిని ఎట్లా ముఖ్యమంత్రిని చేసిండ్రో ఏమో అర్థం కాదు. కానీ మళ్లీ మన సార్ రావాలి మళ్లీ మన సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని ఆయన నోటి నుంచి ఎప్పుడూ వినిపించేది.

    కాబట్టి రేపు మనమందరం పార్టీకి కంకణబద్ధులమై, ఒక్క తాటిపై నడిస్తే కేసీఆర్ గారి గెలుపు, మన బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవలీలగా సాధ్యమవుతుందని మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను.

    ఏది ఏమైనా, ఈ రోజు వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనవంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తూ, ఆ కుటుంబానికి అండగా నిలుద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

    పెద్దలు వినోద్ కుమార్ గారు మరియు పిలవగానే వచ్చి, ఓపికగా మన మధ్య ఇంతసేపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.