EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్‌ఐఆర్‌ వార్డు సభను సద్వినియోగం చేసుకోవాలి ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలి డిప్యూటీ తాసిల్దార్ సుభాన్,ప్రజాప్రతినిధి సయ్యద్‌ ఫైజుల్లా

    Author
    Posted By JANA CHARITRA
    | 28 Aug 2026, 08:01 PM | TELANGANA, వరంగల్
    ఎస్‌ఐఆర్‌ వార్డు సభను సద్వినియోగం చేసుకోవాలి  ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలి డిప్యూటీ తాసిల్దార్ సుభాన్,ప్రజాప్రతినిధి సయ్యద్‌ ఫైజుల్లా

    ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా నిర్వహిస్తున్న వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీఎల్‌ఓ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మహమ్మద్‌ సుభాన్‌,ఎంఐఎం ప్రజాప్రతినిధి సయ్యద్‌ ఫైజుల్లా సూచించారు.వరంగల్‌ మౌలాలి ప్రాంతంలోని ముస్లిం కమిటీ హాలులో ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వేపై వార్డు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు సభలో చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ,ఓటర్లకు కల్పిస్తున్న అవగాహన,ఓటరు జాబితాలో పేర్ల పరిశీలన,అభ్యంతరాలు,సవరణలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని,ఏవైనా తప్పులు ఉంటే నిర్ణీత ఫారాల ద్వారా సవరణలు చేసుకోవాలని మహమ్మద్‌ సుభాన్‌,సయ్యద్‌ ఫైజుల్లా సూచించారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని,అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు.ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా వార్డు సభలో అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో 24వ డివిజన్‌ బీఎల్‌ఓ నాజియా అంజుమ్‌,ఆసియా,అహ్మద్‌,హమీద్‌ మహమ్మద్‌ (సోని),సయ్యద్‌ కబీర్‌,సయ్యద్‌ జీషాన్‌,సయ్యద్‌ సుల్తాన్‌,సాదిక్‌, అజం,మహ్మద్‌ బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.