EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎమ్మెల్యే నాయినికి రాఖీ కట్టిన మహిళా నాయకురాళ్లు

    ఎమ్మెల్యే నాయినికి రాఖీ కట్టిన మహిళా నాయకురాళ్లు

    బాలసముద్రం,హనుమకొండ: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకురాళ్లు, మహిళలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు రాఖీ కట్టిన ప్రతి ఆడపడుచుకు శుభాకాంక్షలు తెలియజేసి, పండుగ కానుకలను అందజేశారు. మహిళా నాయకురాళ్లతో ఆత్మీయంగా మాట్లాడి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షులు శ్రీమతి బంక సరళ, నాయకురాళ్లు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.