EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆటోనగర్, వరంగల్‌లోని బాలుర పరిశీలన గృహాన్ని సందర్శించిన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 02:40 PM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    ఆటోనగర్, వరంగల్‌లోని బాలుర పరిశీలన గృహాన్ని సందర్శించిన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ

    పరిశీలన గృహంలోని బాలల సంక్షేమం, వసతులు మరియు వారికి అందుతున్న సేవలను పరిశీలించారు.
    ఈ సందర్భంగా పరిశీలన గృహంలోని వసతి గదులు, భోజన సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, విద్యా మరియు వృత్తి శిక్షణ, కౌన్సెలింగ్ సేవలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
    బాలలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు మరియు వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి భవిష్యత్తుపై సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
    బాలల హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయంపై వారికి అవగాహన కల్పించాలని సూపరింటెండెంట్ శ్రీదేవి కి సూచనలు చేశారు. బాలలకు అవసరమైన విద్య, ఆరోగ్యం, మానసిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక పునరావాసం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
    పరిశీలన గృహంలో రికార్డుల నిర్వహణ, బాలలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలన గృహంలో నిర్వహించాల్సిన అన్ని రికార్డులు, రిజిస్టర్లు మరియు బాలలకు సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో, ఎప్పటికప్పుడు నవీకరిస్తూ సక్రమంగా నిర్వహించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
    రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం, లోపాలు లేదా జాప్యానికి తావు ఉండకూడదని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా నమోదు చేసి, సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

    అదేవిధంగా పరిశీలన గృహంలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్య, వైద్య సేవలు, కౌన్సెలింగ్, భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించి, అవసరమైన చోట తక్షణమే మెరుగుదల చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
    రికార్డుల నిర్వహణ బాలల సంక్షేమానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో పరిశీలన గృహం సూపరింటెండెంట్ శ్రీదేవి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.రజినీ, పరిశీలక గృహ సిబ్బంది పాల్గొన్నారు.