EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దే నా లక్ష్యం - మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 12:30 PM | TELANGANA, తాజా వార్తలు, నల్గొండ
    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దే నా లక్ష్యం - మేయర్ బుర్రి చైతన్య  శ్రీనివాస్ రెడ్డి

    నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు.
    ఈరోజు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు అని.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.తనుకు ఏ డివిజన్ పై వివక్షత లేదని... అన్ని డివిజన్ లను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
    ప్రతిరోజు ఒక వార్డును సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. *కార్పొరేషన్ లో అన్ని డివిజన్లలో వందల రూపాయలతో మిగిలిన సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు
    *డివిజన్ లలో ఏ సమస్యలు ఉన్నా సమావేశం దృష్టికి, తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.