EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాధితులకు పీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 07:08 PM | TELANGANA, వరంగల్, హన్మకొండ
    బాధితులకు పీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

    *సమస్య తెలిసిన వెంటనే స్పందించిన ఎంపీ డా. కావ్య*

    *క్యాన్సర్ చికిత్స కోసం సదాల సంతోషికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం*

    *ఎంపీ డా.కడియం కావ్య చొరవతో మంజూరైన పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నిధులు*

    ఇవి కూడా చదవండి


    క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నామిలిగొండకు చెందిన శ్రీమతి సదాల సంతోషికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అందజేశారు.

    సదాల సంతోషి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమన్న విషయం తన దృష్టికి రాగానే ఎంపీ డా. కడియం కావ్య వెంటనే స్పందించి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంపీ చొరవతో రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది.

    *ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ..* ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని, చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపిన ఎంపీ డా. కడియం కావ్యకు సదాల సంతోషి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.