EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రైవేట్ ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలి ప్రైవేట్ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సింగనబోయిన శ్రీశైలం,

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Sep 2026, 12:24 PM | TELANGANA, వరంగల్
    ప్రైవేట్ ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలి  ప్రైవేట్ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సింగనబోయిన శ్రీశైలం,

    ఉపాధ్యాయుడు ప్రభుత్వ స్కూల్స్ లో బోధించిన ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ లో బోధించినా, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఒక్కటే,
    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త అయిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించడం మన సంప్రదాయం
    అయితే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదు, విద్యారంగంలో ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు కూడా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు,
    విద్యార్థి భవిష్యత్తుకు ఉపాధ్యాయుడే బాటసారీ
    ఒక విద్యార్థి మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు క్రమశిక్షణ, విలువలు, బాధ్యత, సామాజిక స్పృహ, సృజనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో గొప్పది,
    ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ప్రతిరోజూ విద్యార్థుల కోసం ఎంతో శ్రమిస్తున్నారు, అలాగే ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధనతో పాటు పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సందేహాల నివృత్తి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, తల్లిదండ్రులతో సమన్వయం వంటి అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
    వారి సేవలను కేవలం వారు పనిచేస్తున్న సంస్థ స్వభావం ఆధారంగా కొలవడం సరైన విధానం కాదు,
    అవార్డు అనేది ఉద్యోగం ఆధారంగా కాదు… సేవ ఆధారంగా ఉండాలి
    “ఉత్తమ ఉపాధ్యాయుడు” అనే గుర్తింపు ఒక ప్రభుత్వ టీచర్ హోదాకు మాత్రమే పరిమితం కాకూడదు, నిజంగా ఉత్తమంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎవరు? విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చారు? విద్యార్థుల ప్రతిభను ఎలా వెలికి తీశారు? సమాజానికి ఉపయోగపడే పౌరులుగా వారిని ఎలా తీర్చిదిద్దారు? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను అందించాలి, నేడు ప్రభుత్వ స్కూల్స్ లో కంటే ప్రైవేట్ స్కూల్ లో ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్నారు కావున
    ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను గౌరవించడం ఎంత అవసరమో, ప్రైవేట్ పాఠశాలల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం కూడా అంతే అవసరం
    ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పించాలి
    ప్రభుత్వం నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలి, ఇందుకోసం పారదర్శకమైన మార్గదర్శకాలను రూపొందించి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుంచి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి,
    అవార్డు పొందే ఉపాధ్యాయుడి ఎంపికలో బోధనా నాణ్యత, విద్యార్థుల ప్రగతి, వినూత్న బోధనా పద్ధతులు, సామాజిక సేవ, విద్యార్థుల్లో విలువల పెంపకం, వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధి వంటి అంశాలను ప్రమాణాలుగా తీసుకోవచ్చు.
    ఉపాధ్యాయుడిని గౌరవించడం అంటే విద్యను గౌరవించడం
    విద్యకు ప్రభుత్వ, ప్రైవేట్ అనే భేదం ఉండకూడదు. విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి ఉపాధ్యాయుడికి గౌరవం దక్కాలి.
    సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న మనం, ఆయన చూపిన విద్యా విలువలకు అనుగుణంగా ప్రతి నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడిని గౌరవించాలి.
    అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మరియు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించే విధానాన్ని తీసుకురావాలి.
    ఉపాధ్యాయుడి గొప్పతనం ఆయన పనిచేసే పాఠశాల రకంలో లేదు… ఆయన తీర్చిదిద్దిన విద్యార్థుల భవిష్యత్తులో ఉంది.
    ప్రభుత్వం స్పందించాలి – ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా సముచిత గౌరవం కల్పించాలని శ్రీశైలం ప్రభుతాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, పరపల్లి సాంబయ్య సాంబయ్య, కొనుకటి రాజు పాల్గొన్నారు.