EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులు గౌడ్

    Author
    Posted By AKULA MADHU
    | 02 Sep 2026, 12:32 PM |
    వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ   చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులు గౌడ్

    చౌటుప్పల్ మండలం లక్కారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ,
    వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 17 వ వర్ధంతి సందర్బంగా వైయస్సార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులు గౌడ్, ఈ సందర్భంగా సైదులు గౌడ్ మాట్లాడుతూ... అది శాసనసభ అయినా లోక్ సభ అయినా ఎన్నిక ఏదైనా ఓటమి అంటే తెలియని నాయకునిగా చరిత్ర సృష్టించి,2003లో మండుటెండలో సుదీర్ఘ పాదయాత్ర చేసి, కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి, ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అంతటి బాలరాజుగౌడ్, కొరగోని లింగస్వామి నాయకులు వీరమళ్ళ సత్తయ్య గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.