EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వృద్ధ దంపతులకు అండగా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. Dr. యర్ర మాద కృష్ణారెడ్డి.

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Sep 2026, 06:52 PM | TELANGANA, నల్గొండ
    వృద్ధ దంపతులకు అండగా సమాచార హక్కు వికాస సమితి  వ్యవస్థాపక అధ్యక్షులు. Dr. యర్ర మాద కృష్ణారెడ్డి.

    నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, దుబ్బాతండ కు చెందిన భూక్యా మాల్సుర్ వృద్ధ దంపతులకు అండగా నిలిచి కుమారులకు, కుమార్తెలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు ఆహారం, నివాస వసతి కల్పించాలని వారి మధ్య వున్నా వివాదాలని పరిష్కరించి ఒప్పంద పత్రం రాయించిన సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. Dr. యర్ర మాద కృష్ణారెడ్డి. నల్గొండ జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్. నేడు వ్యక్తిగత పని నిమిత్తం మిర్యాలగూడ రెవిన్యూ డివిజినల్ కార్యాలయం వెళ్లిన సమయంలో కార్యాలయం బయట వృద్ధ దంపతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి వారి వద్దకు వెళ్లి ఏమి పని మీద వచ్చారు?. ఏమి జరిగింది? అని అడగడం జరిగింది. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. వృద్ధ దంపతుల పేరుపై ఉన్న భూములు పట్టా హక్కులు కుమారులు పొందిన తదుపరి మమ్ములను పట్టించుకోవడం లేదని,పోషణకు, అనారోగ్యం సమస్యలకు డబ్బులు ఇవ్వడం లేదని, ఇబ్బందులు పెడుతున్నారని తెలిపినారు. అప్పుడు అక్కడే వున్నా కుమారులను, కుమార్తెలను పిలిపించి... వృద్ధుల సంరక్షణ చట్టం-2007. సవరణ చట్టం -2011 ల గురించి చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా కుమారులకు, కుమార్తెలకు ఇచ్చిన, చేసిన భూమి పట్టా హక్కులు రద్దు పరిచే అధికారం రెవిన్యూ డివిజనల్ అధికారికి కలదు అని వివరించడం జరిగింది. వారి మధ్య వున్నా మనస్పర్ధల కారణంగా వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని తెలియజేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధులను సరిగ్గా చూసుకోవాలని వారి నచ్చజెప్పి వారి వివాదాన్ని పరిష్కరించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ చట్టం సమర్థవంతంగా అమలుకు జిల్లాలో ఫీల్డ్ మేనేజర్, డివిజన్ల వారీగా వారీగా ఆర్డీవోలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వృద్ధులకు అండగా వుంటున్నారని సమాచార హక్కు వికాస సమితి వృద్ధులకు సహాయం పడే ఆదేశాలు జారీ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేయ్యడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులను నిరాధారణకు గురి చేసినట్లయితే వారికి అండగా సమాచార హక్కు వికాస సమితి ఉంటుందని వారి హక్కుల రక్షణను సమాచార హక్కు వికాస సమితి వారి వెంట ఉండి పనిచేస్తుందని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు. వృద్దులకు సహాయం కొరకు ప్రభుత్వం "14567" టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చెయ్యాలని తెలిపినారు.