EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోచమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొని బోనం ఎత్తిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Sep 2026, 06:55 PM | TELANGANA, వరంగల్
    పోచమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొని బోనం ఎత్తిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

    ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బోనం ఎత్తిన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

    ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం నిర్వాహకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారిని ఘనంగా సన్మానించారు.

    ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ & ముదిరాజ్ సంఘం నాయకులు భయ్యా స్వామి, బీజేపీ నాయకులు రత్నం కృష్ణ కిషోర్, జూలూరి నైనేష్, గొడిశాల కార్తీక్ గౌడ్ మరియు కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.