EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుడా చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 08:52 PM | Array
    కుడా చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు

    బీసీ మహిళలకు అత్యున్నత పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం

    వరంగల్, సెప్టెంబర్ 3:

    కుడా చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు - Additional Image

    తనను కుడా చైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుండు సుధారాణి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

    బీసీల పక్షపాతిగా, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీ మహిళలకు అత్యంత కీలకమైన, ప్రధానమైన పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    బీసీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు అందించడం కేవలం పదవుల కల్పన మాత్రమే కాదని, బీసీ వర్గాలపై ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకానికి, మహిళల సామర్థ్యంపై ఆయనకున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

    ఈ నిర్ణయం రాష్ట్రంలోని బీసీ మహిళల్లో నూతన ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తుపై భరోసాను కలిగించిందని తెలిపారు. బీసీ మహిళలు కూడా నాయకత్వం వహించగలరు, నిర్ణయాలు తీసుకోగలరు, సమాజానికి మార్గనిర్దేశం చేయగలరు అనే బలమైన సందేశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారని అన్నారు.

    తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా, బీసీల అభ్యున్నతికి మరియు మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తానని గుండు సుధారాణి తెలిపారు.

    బీసీల సంక్షేమం, మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నా నియామకానికి సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ గుండు సుధారాణి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.