EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.

    Author
    Posted By JANA CHARITRA
    | 04 Sep 2026, 08:06 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.

    1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన..పర్వతగిరి లో వంట వార్పులో తీవ్ర విమర్శలు
    పర్వతగిరి మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం , సెప్టెంబర్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు భారీ నిరసన ర్యాలీ, రోడ్డుపై బైఠాయింపు, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు.అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ కూడలి నుండి భారత్ పెట్రోల్ బంక్ వద్ద కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా సర్కిల్ వద్ద వంటా-వార్పు నిర్వహించి ఎన్నికల హామీల అమలును డిమాండ్ చేశారు.
    ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల తరఫున ఈ నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.

    రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,40,340 కోట్ల మేర బాకీ పడిందని ఆరోపించిన ఆయన, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలు కూడా అమలు కాలేదని అన్నారు.

    ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు , ఇటీవల పంపిణీ చేసిన ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అప్పగించలేదని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో లక్ష ఎకరాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఇప్పించారు.

    ఇవి కూడా చదవండి

    మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. “కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామరక్ష… తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా” అని వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెప్పుకున్న అభివృద్ధి పనులను పర్వతగిరి మండలం లో ఎమ్మెల్యే
    నిరూపించాలని ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు కోరారు.

    కాంగ్రెస్ మంత్రులపైనే 30 శాతం కమిషన్ ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని, డిపాజిట్లు సైతం దక్కవని ఎద్దేవా చేశారు.

    ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మనోజ్ గౌడ్, మాజీ ఏఎంసీ డైరెక్టర్లు బోయినపల్లి యుగంధర్ రావు, ఏకాంతం గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు రంగు కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు చీమల బిక్షపతి, చిన్నపాక శ్రీనివాస్,మాడుగుల రాజు, సర్పంచులు ఏర్పుల శ్రీనివాస్, డెక్క అనిత కుమారస్వామి, బానోతు దశరథ్, బాధవత్ కిషన్ నాయక్, వెలికట్టే కృష్ణవేణి వేణు, గూగులోత్ భద్రమ్మ వీరన్న, ధరావత్ లక్ష్మీ బాలాజీ, తేజావాత్ ఝాన్సీ మోహన్ నాయకులు అమడగని రాజు, బానోతు వెంకన్న,కొల్లూరి వెంకటేశ్వర్లు,గంధం బాలరాజు, చింతల శ్రీనివాస్,మట్టపల్లి మాధవ రావు, జంగిలి బాబు, సూర అశోక్, దర్నోజు దేవేందర్, దేవేందర్ రావు,బూర శ్యామ్ గౌడ్, గూడ నరేందర్,బోట్ల మధు,దొమ్మటి లష్మినారాయణ,బరిగేలవిజయ ,వెంకట్ రాజు,జంగిలి యాకయ్య, భూక్యా రవి, మూడు రవి,మెరుగు వెంకన్న, మట్టపెల్లి వంశీ, తిరుపతి, వెంకట్ రామ్ రెడ్డి, బట్టు వీర్య నాయక్, వెంకట్ రెడ్డి,చింతపట్ల సునీల్, మాసాని వెంకట్,వల్లందాస్ వెంకన్న, బోట్ల భాస్కర్, దెబ్బేట నరేష్,వార్డు సభ్యులు కొప్పు రాజు చిన్నపెల్లి విజయ, తుంగ రాజు బొట్ల వెంకన్న, ఇస్లావత్ హరీష్,చిన్నపెల్లి అజయ్ రైతులు, మహిళలు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.