EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు చిరస్మరణీయం

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Sep 2026, 06:55 PM | TELANGANA, వరంగల్
    సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు చిరస్మరణీయం

    వరంగల్ జిల్లా: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, ముఖ్యంగా విద్యాసంస్థల్లో గురుపూజోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారని ప్రైవేట్ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సింగనబోయిన శ్రీశైలం తెలిపారు, ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు, ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఆయనకు ఇచ్చే గౌరవానికి ప్రతీక అని అన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలు, విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని శ్రీశైలం పేర్కొన్నారు, తత్వశాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన భారతదేశ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని తెలిపారు, విద్యార్థుల్లో జ్ఞానం, నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు ఉపాధ్యాయుల సేవలను సమాజం ఎల్లప్పుడూ గౌరవించాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సంగెం మండలం బాధ్యులు కొనుకటి రాజు, చేన్నారావు పేట మండలం బాధ్యులు మాదరపు శ్రీనివాస్, దుగ్గొండి మండలం బాధ్యులు బట్టు నాగ రాజు పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటం దగ్గర నివాళులు అర్పించారు