EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జగన్నాధపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన

    Author
    Posted By JANA CHARITRA
    | 06 Sep 2026, 03:48 PM | TELANGANA, వరంగల్
    జగన్నాధపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన

    రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మరియు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోరాట కార్యక్రమాలలో భాగంగా రాయపర్తి మండలం **జగన్నాధపల్లి గ్రామంలో** నిరసన కార్యక్రమం నిర్వహించారు.

    పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుధ్య వ్యవస్థకు నిరసనగా ఈ రోజు **బీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు**.

    ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    ఇవి కూడా చదవండి