EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Sep 2026, 04:00 PM | TELANGANA, వరంగల్
    కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

    కొత్తవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుశిక్షణ కార్యక్రమంలో మూడో బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

    ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ Rtn అధ్యక్షుడు సోమ వేణుగోపాల్, ప్రాజెక్ట్ చైర్మన్ Rtn pp బేతి అశోక్ బాబు, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, నేత రాగవులు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.

    మహిళలకు కుట్టుశిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇది దోహదపడుతుందని వారు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    కార్యక్రమ నిర్వాహకులు ఆడెపు శిరీష, శ్రీ కరుణ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ శిక్షణా కేంద్రం ద్వారా 100 మంది మహిళలు కుట్టుశిక్షణ పూర్తి చేసుకుని ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

    మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి, వారిని స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడం ద్వారా మహిళా సాధికారతకు తోడ్పడటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.