EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం: కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Sep 2026, 09:46 PM | TELANGANA, వరంగల్
    స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం: కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం

    వరంగల్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

    ఈ వ్యాఖ్యలకు నిరసనగా నేడు హాసన్పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రేణిగుంట్ల అశోక్, డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్, పుట్ట తిరుపతి ఆధ్వర్యంలో భారీ ధర్నా, దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. అత్యున్నతమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై బాధ్యతారహితంగా, అవమానకరంగా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తాతా మధు తక్షణమే స్పీకర్ గారికి, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదు. తాతా మధు వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు సంఘీభావం ప్రకటించారు.

    స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు.. రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది.

    ఇవి కూడా చదవండి

    ఒక అట్టడుగు వర్గాల బిడ్డ, దళిత బిడ్డ శాసనసభ స్పీకర్‌గా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుండా ఉంటారు. కానీ ఆయన పార్టీకి చెందిన నాయకులు మాత్రం బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు.

    స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆయనను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను అని పిర్యాదు చేశారు.

    తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా మాట్లాడినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.

    శాసనసభ, స్పీకర్ పదవి పట్ల కనీస గౌరవం లేని విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

    ఈ నిరసన కార్యక్రమంలో బాల్మంచ్ అధ్యక్షులు జిన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కిరణ్, సురేందర్ రెడ్డి, ఐలయ్య, డిసిసి నాయకులు బుచ్చిరెడ్డి, రవీందర్, మధు, సురేష్, రాజు, వెంకన్న, మహిళా నాయకురాలు పల్లెపు అనూష తదితరులు పాల్గొన్నారు.