EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి..

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Sep 2026, 09:50 PM | Politics, TELANGANA, వరంగల్
    స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి..

    స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను..*

    *రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే…*

    *తాతా మధు వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి..*

    *శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతపై అత్యంత హేయంగా, అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలి డిమాండ్ చేసిన డీసీసీ అధ్యక్షుడు అయూబ్ …*

    తెలంగాణ శాసనసభ సాక్షిగా ఉన్నత పదవిలో ఉన్న గౌరవనీయ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ సెంటర్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారి మరియు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనపై బీఆర్‌ఎస్ పార్టీ తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ…

    ఒక దళిత బిడ్డ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్నత స్థానంలో కొనసాగుతుండగా, ఆయనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

    దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ నాయకులు, ఇప్పుడు అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉన్నత పదవిలో కొనసాగడాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలకు దిగడం వారి అహంకారానికి నిదర్శనమని అయూబ్ మండిపడ్డారు.

    ప్రజల సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్‌ఎస్ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నా తమ వైఖరిని మార్చుకోలేదని విమర్శించారు.

    రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై బీఆర్‌ఎస్ పార్టీ తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ స్పష్టం చేశారు…

    ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల, టౌన్, డివిజన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….