EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కీర్తినగర్ యు.పి.హెచ్.సి.లో ఆరోగ్య మహిళ క్లినిక్‌ను పర్యవేక్షించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 04:17 PM | TELANGANA, వరంగల్
    కీర్తినగర్ యు.పి.హెచ్.సి.లో ఆరోగ్య మహిళ క్లినిక్‌ను పర్యవేక్షించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

    వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి కీర్తినగర్ యు.పి.హెచ్.సి.లో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ క్లినిక్‌ను పర్యవేక్షించారు.

    ఈ సందర్భంగా ఆరోగ్య మహిళ క్లినిక్‌లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, సంబంధిత రికార్డులు మరియు రిజిస్టర్లను తనిఖీ చేశారు. క్లినిక్‌కు వచ్చిన మహిళా రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, స్క్రీనింగ్ మరియు ఆరోగ్య పరీక్షలపై వివరాలు తెలుసుకున్నారు.

    ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మహిళలకు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. స్క్రీనింగ్‌లో గుర్తించిన అనుమానిత కేసులకు తగిన విధంగా తదుపరి పరీక్షలు, చికిత్స మరియు రిఫరల్ సేవలు అందించాలని ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    అలాగే ఆరోగ్య మహిళ క్లినిక్ లను ప్రతి మంగళ వారం నిర్ణీత సమయాల్లో తప్పనిసరిగా పనిచేసేలా చూడాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని డి ఎం ఎచ్ ఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.