EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీజేలపై నిషేధం – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 06:44 PM | TELANGANA, వరంగల్
    డీజేలపై నిషేధం – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేలు వినియోగంపై ఉన్న నిషేధాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు.నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేసినట్లయితే సంబంధిత వ్యక్తులు, నిర్వాహకులు మరియు డీజే ఆపరేటర్లపై చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు డీజే పరికరాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో డీజే ఆపరేటర్లకు ఎస్సై ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు బైండోవర్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులకు సహకరించాలని సూచించారు.