EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి.

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 07:56 PM | TELANGANA, వరంగల్
    స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి.

    *స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు.. వెంటనే సస్పెండ్ చేయాలి.*
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి *పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇస్లావత్ సావిత్రి.*
    తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు పర్వతగిరి మండలం కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి బి ఆర్ ఎస్ ఎంఎల్‌సి తాతా మధు ధిష్టిబొమ్మ దహనం చేసారు.
    ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి మాట్లాడుతు
    రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదు.
    స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు.. రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది.
    ఒక అట్టడుగు వర్గాల బిడ్డ, దళిత బిడ్డ శాసనసభ స్పీకర్‌గా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుండా ఉంటారు. కానీ ఆయన పార్టీకి చెందిన నాయకులు మాత్రం బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు.
    స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆయనను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
    తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా మాట్లాడినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.
    శాసనసభ, స్పీకర్ పదవి పట్ల కనీస గౌరవం లేని విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలి అని అన్నారు
    ఈ కార్యక్రమంలో జిల్లా, మండల ముఖ్య నాయకులు, సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు , యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల నాయకులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.