EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Sep 2026, 07:34 PM | TELANGANA, వరంగల్
    తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

    వరంగల్ నగరంలోని భద్రకాళి రోడ్డు నందుగల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మండపం నందు తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల కమిటీ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి హాజరైన విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరిగినది. ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి కుంటమల్ల అరవింద్ అధ్యక్షునిగా, మునిగంటి అమరేంద్ర చారి ప్రధాన కార్యదర్శిగా, అలాగే హనుమకొండ జిల్లా నుండి ఉల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా దించనాల రాజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తుములూరి సత్యనారాయణ , ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ ద్వారా విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ ల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరింత క్రియాశీలంగా పనిచేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అలుగూరి హరినాథ్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మండలోజు కృష్ణ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఓదెల సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. ప్రవీణ్ చారి, రాష్ట్ర కార్యదర్శి కలకోటి వీరభద్ర చారి, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.