EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్డు ఆక్రమణతో రాకపోకలకు ఇబ్బందులు కాశికుంట పోచమ్మ గుడి లేన్‌లో రేకుల షెడ్‌ నిర్మాణం

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Sep 2026, 07:52 PM | TELANGANA, వరంగల్
    రోడ్డు ఆక్రమణతో రాకపోకలకు ఇబ్బందులు కాశికుంట పోచమ్మ గుడి లేన్‌లో రేకుల షెడ్‌ నిర్మాణం

    *అత్యవసర వేళల్లో వాహనదారుల అవస్థలు..తొలగించాలని స్థానికుల వినతి*
    41వ డివిజన్‌ పరిధిలోని కాశికుంట పోచమ్మ గుడి లేన్‌లో రేకుల షెడ్‌ నిర్మాణంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రహదారికి అడ్డంగా నిర్మాణం చేపట్టడంతో మార్గం ఇరుకుగా మారిందని,మున్సిపల్‌ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.స్థానికుల వివరాల ప్రకారం..H.No.18-5-102/2 వద్ద భూపతి రజిత(రవీందర్‌ భార్య)రహదారికి ఆనుకుని రేకుల షెడ్‌,షట్టర్‌ నిర్మించినట్లు తెలిపారు.దీంతో ద్విచక్ర వాహనాలు,కార్లు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ఉదయం,సాయంత్రం వేళల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు,ఇతర వాహనాలు కాలనీలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి,నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లయితే తొలగించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.రోడ్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు ప్రజాప్రతినిధులు,మున్సిపల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు.