EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాళోజీ జయంతి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన చెరకు సుధాకర్ గౌడ్

    Author
    Posted By AKULA MADHU
    | 10 Sep 2026, 09:36 AM |
    కాళోజీ జయంతి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన చెరకు సుధాకర్ గౌడ్

    కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు గారి 112 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు డాక్టర్ చెరకు సుధాకర్ గౌడ్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు గారు నిరంతర ఉద్యమ జీవి అని, సమస్త ఉద్యమాలతో వారు సహవాసం చేశారని, కాలంబు రాగానే కాటేసి తీరాలే లాంటి ఎన్నో కవితల ద్వారా పాలకుల్ని ప్రశ్నించి,ఎదిరించి సమాజం కోసమే బతికిన కాళోజీ ఉద్యమాలే శ్వాసగా బ్రతికి తెలంగాణ యాసను భాషను సంస్కృతులను ఎలిగెత్తి చాటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఆకుల మధు,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 8 వ వార్డ్ కౌన్సిలర్ బద్రిగాలయ్య, మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, కూరెల్ల నరసింహ చారి, తల్వార్ తాత( సంజీవ), చినుకని యువరాజ్, కామ్రేడ్ నరసింహ , ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ తీగుళ్ల శ్రీనివాస్ ,, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.