EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు దళిత వ్యతిరేక వైఖరిపై భారీ రాస్తారోకో లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అయూబ్

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Sep 2026, 01:24 PM | TELANGANA, వరంగల్
    వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు దళిత వ్యతిరేక వైఖరిపై భారీ రాస్తారోకో లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అయూబ్

    BRS, BJP పార్టీల దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ మండల, టౌన్ కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం వర్ధన్నపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారి నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా BRS, BJP పార్టీలు దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని, అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నాయని నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ.తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BRS ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై BRS అధినేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి సభ ముగిసిన అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధి చేసి దళితులను అవమానించిన బీజేపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    అలాగే ప్రభుత్వ అధికారులపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేయి చేసుకున్న ఘటన ఆ పార్టీ అహంకారానికి, చట్టం పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని అయూబ్ విమర్శించారు.ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ దళితులను, ప్రభుత్వ అధికారులను అవమానిస్తున్న ప్రజా వ్యతిరేక BRS, BJP పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, టౌన్ అధ్యకుడు ఈగ దామోదర్, ఐనవోలు ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల ఎస్పీ సెల్ అధ్యక్షుడు ప్రశాంత్, వార్డు సభ్యులు, సర్పంచులు, మండల, టౌన్, నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, యూత్, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు....