EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాజ్యాంగ పదవుల గౌరవాన్ని దిగజార్చే వ్యాఖ్యలు సహించేది లేదు - సంఘీ ఎలేందర్ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Sep 2026, 01:29 PM | TELANGANA, వికారాబాద్
    రాజ్యాంగ పదవుల గౌరవాన్ని దిగజార్చే వ్యాఖ్యలు సహించేది లేదు  - సంఘీ ఎలేందర్  దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి

    ఈరోజు తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి (DHPS) వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అండర్ బ్రిడ్జి జీవుల అడ్డా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా DHPS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘీ ఎలేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితున్నే ముఖ్యమంత్రి నీ చేస్తాను అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.తాజాగా కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే, పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం ఎనకటి కాలంలో దళితులు నడిచిన భూమిలో అగ్రవర్ణ నాయకులు నడవాలంటే దళితులకు మూతికి ముంత ముడ్డికి తాటాకులు కట్టించే వారు అని గుర్తు చేశారు ఈ కాలంలో కూడా శుద్ధి కార్యక్రమాలు చేయించడం ఆయనలోని దొర అహంకార ధోరణికి నిదర్శనమని వారు విమర్శించారు. దళితులను అవమానించే ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు.
    దళిత సమాజానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఉన్న సమయంలో శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ఆయనను అవమానిస్తున్నాడు అని వారు ఆరోపించారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సహచర మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్ల కూడా అవమానకరమైన వైఖరిని ప్రదర్శించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

    అదేవిధంగా శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలను DHPS తెలంగాణ వరంగల్ జిల్లా సమితి తీవ్రంగా ఖండించింది.
    రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా అవమానించడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, అది శాసనసభ వ్యవస్థను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని వారు పేర్కొన్నారు.
    రాజకీయంగా విభేదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రభుత్వ విధానాలను, స్పీకర్ నిర్ణయాలను లేదా రాజకీయ వైఖరిని విమర్శించవచ్చని అన్నారు. అయితే వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ సంస్కారం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
    దళిత సమాజానికి చెందిన వ్యక్తి రాజ్యాంగబద్ధమైన కీలక పదవిలో ఉన్నప్పుడు ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం మరింత అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు. దళితులు రాజ్యాంగం ద్వారా సాధించుకున్న రాజకీయ ప్రాతినిధ్యాన్ని, అధికార భాగస్వామ్యాన్ని అవమానించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.
    అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధులు రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిందేనని అన్నారు. వ్యక్తిగత కక్షలు, రాజకీయ అసహనం, ఆధిపత్య ధోరణులను ప్రజాస్వామ్య వేదికలపై ప్రదర్శించడం తగదని హితవు పలికారు.
    ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే తన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, శాసనసభ స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అలాగే తాత మధుని ఈ సెషన్ వరకు సస్పెండ్ చేయడం కాదు ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని సంఘీ ఎలేందర్ డిమాండ్ చేశారు.
    లేనిపక్షంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడేందుకు దళిత సంఘాలు, ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
    పాల్గొన్నతాళ్ళపల్లి జాన్ పాల్ DHPS వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి జన్ను హరిబాబు DHPS జిల్లా ఉప అధ్యక్షులురాచర్ల రాజేందర్ ఖిలా వరంగల్ మండల కార్యదర్శి జన్ను రాజుఖిలా వరంగల్ మండల అధ్యక్షులు బాణాల మహేష్ గీసుకొండ మండల కార్యదర్శి సిలివేరు రాజేష్ గీసుకొండ మండల అధ్యక్షులు మరియు
    బొంకురి ఆరోగ్యం, కళకోట్ల కుమారస్వామి,గిద్దెల మానస, పసునూరి ఇమ్మనియల్,రత్నం, సుగుణ,వరలక్ష్మీ, సంపూర్ణ,మరియ, సింగారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు