EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Sep 2026, 07:37 PM | TELANGANA, వరంగల్
    నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో మోసం  ఇద్దరు నిందితుల అరెస్ట్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

    నకిలీ బంగారం తాకట్టు పత్రాన్ని సృష్టించి, వాస్తవంగా బంగారం తాకట్టు లేకపోయినా ఉన్నట్లు నమ్మించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
    అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్ మరియు సీఈఓ, వడ్డేపల్లి రంజిత్ (39), వ్యాపారి ఉన్నారు.
    పోలీసుల విచారణలో, ఇద్దరూ కలిసి కుట్ర పన్ని రంజిత్‌కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం, శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్‌లో తాకట్టు ఉన్నట్లు చూపిస్తూ నకిలీ ప్లెడ్జ్ రసీదు తయారు చేసినట్లు వెల్లడైంది.
    ఆ నకిలీ పత్రాన్ని నిజమైనదిగా నమ్మించిన నిందితులు, బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి తన బ్యాంక్ నుంచి RTGS ద్వారా రూ.59,30,000/-**ను శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేసినారని పోలీసులు తెలిపారు.
    అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గోల్డ్ కంపెనీ ప్రతినిధులు హెచ్చరించడంతో, ఖాతాలోని నగదును ఇతర అవసరాలకు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. .
    కేసు దర్యాప్తులో నిందితుల మొబైల్ ఫోన్‌లు మరియు pledge కాపీ ని స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మోసంలో మరెవరైనా ప్రమేయం ఉందా, ఇదే తరహాలో ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేశారా అనే కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది.


    హనుమకొండ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ
    గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు మరియు ప్రజలు నకిలీ తాకట్టు పత్రాలను నమ్మకుండా, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని పోలీస్ లు సూచించారు