EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా X- రే స్క్రీనింగ్ క్యాంపు

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 03:50 PM | TELANGANA, వరంగల్
    ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా X- రే స్క్రీనింగ్ క్యాంపు

    తేదీ 11. 9. 2026 రోజున జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి హనుమకొండ డాక్టర్ ఏ.అప్పయ్య గారు ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా X- రే స్క్రీనింగ్ క్యాంపు లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి పాల్గొని పరిశీలించడం అయినది. ఎవరైనా రెండు వారాలకు మించి దగ్గు, చాతిలో నొప్పి, ద గ్గినప్పుడు తెమడపడటం, బరువు తగ్గడం,ఆకలి లేకపోవడం రాత్రిపూట జ్వరం రావడం లాంటి లక్షణాలున్నట్టయితే ప్రతి ఒక్కరు తేమడ పరీక్ష మరియు x-ray పరీక్ష చేయించుకోవాలని క్షయ వ్యాధి అవగాహన మరియు నిర్మూలన సదస్సులు విస్తృతంగా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి టీబి నీ నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నారని, టీబి వ్యాధి మందులతో పూర్తిగా నయం అవుతుందని మందులు & నిర్ధారణ పరీక్షలుపూర్తిగా ఉచితం అని,పుట్టిన వెంటనే బిడ్డకు బీసీజీ వేయించాలని మరియు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలని, టీబి నివారణ మనందరి బాధ్యత కావాలని సూచించడం అయినది.
    ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారి వెంట జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రామ్ భార్గవ్ గారు, డాక్టర్ సురేష్ గారు CHO మాధవ రెడ్డి,DPMO దేవ్ సింగ్,ఒప్తాలమిక్ ఆఫీసర్ ప్రతాప్ జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ ఆఫీసు సిబ్బంది మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.