EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పొలాల్లోకి దిగిన వరంగల్ కలెక్టర్.. రీ-సర్వేపై సీరియస్ వ్యవసాయ భూములపై ప్రత్యక్ష పరిశీలన

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 08:34 PM | TELANGANA, వరంగల్
    పొలాల్లోకి దిగిన వరంగల్ కలెక్టర్.. రీ-సర్వేపై సీరియస్ వ్యవసాయ భూములపై ప్రత్యక్ష పరిశీలన

    “ఎలాంటి తప్పులకు తావులేదు..*
    *పకడ్బందీగా నిర్వహించాలి” – అధికారులకు కలెక్టర్ ఆదేశాలు*
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    *పర్వతగిరి:* భూముల రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు.
    పర్వతగిరి మండలం జమాల్‌పురం గ్రామంలోని వ్యవసాయ భూముల్లోకి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వే పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి.. భూముల హద్దులు, కొలతలు, రికార్డుల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారు అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
    ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. భూముల రీ-సర్వేలో చిన్నపాటి తప్పిదాలకు కూడా అవకాశం ఇవ్వకుండా, నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా, పూర్తి పారదర్శకతతో సర్వే ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేశారు.

    క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం మాత్రమే వివరాలను నమోదు చేయాలని, భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భూ హద్దులు, రికార్డులకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

    కలెక్టర్ స్వయంగా వ్యవసాయ భూముల్లోకి వెళ్లి రీ-సర్వే పనులను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా యంత్రాంగం రీ-సర్వే ప్రక్రియను ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో ఈ పర్యటన స్పష్టం చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సుమ, డి ఆర్ డి ఓ పి డి నాగ పద్మజ, సర్వే ఏడి శ్రీనివాసు ,స్థానిక తహసిల్దార్ వెంకటస్వామి, జమల్ పురం గ్రామ సర్పంచ్ సోమారం గ్రామ సర్పంచి తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి