EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళ అదృశ్యం కేసులో ట్విస్ట్‌..దారుణ హత్యగా తేలిన వైనం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి..భయంతో హత్య చేసినట్లు నిందితుడి అంగీకారం

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 09:45 PM | TELANGANA, వరంగల్
    మహిళ అదృశ్యం కేసులో ట్విస్ట్‌..దారుణ హత్యగా తేలిన వైనం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి..భయంతో హత్య చేసినట్లు నిందితుడి అంగీకారం

    తెలంగాణ హసన్‌పర్తి,సెప్టెంబర్‌ 11*

    హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది.సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం..హసన్‌పర్తి పరిధికి చెందిన తౌటం స్వప్న(40)మే 15 నుంచి కనిపించకుండా పోయింది.ఆమె తండ్రి అమంచ రాజేందర్‌ ఫిర్యాదు మేరకు మే 31న ఎస్‌ఐ బి. సుజిత్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో స్వప్నకు పరిచయమున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన వొద్దిరాజుల బసవరాజ్‌ (27)పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.స్వప్న తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు,వివాహానికి అంగీకరించకపోతే తమ ఫొటోలు,వీడియోలను బయటపెడతానని చెప్పడంతో బసవరాజ్‌ భయపడినట్లు పోలీసులు తెలిపారు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను బళ్లారికి రప్పించి గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతు పిసికి హత్య చేసినట్లు వెల్లడించారు.అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు,తన రక్తపు మరకలున్న దుస్తులను పెట్రోల్‌తో తగులబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.స్వప్న మొబైల్‌ ఫోన్‌ను చెరువులో పడేసినట్లు తెలిపారు.వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితుడు శుక్రవారం అంబాల–కమలాపూర్‌ రోడ్డులో హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ ఎ.మహేందర్‌ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బసవరాజ్‌ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.దీంతో పోలీసులు వెంబడించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.అతడి వద్ద నుంచి రియల్‌మీ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై బీఎన్‌ఎస్‌ 103,238 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ ఎ.మహేందర్‌,ఎస్‌ఐలు సుజిత్‌,రవి,దేవేందర్‌,ఏఏఓ సల్మాన్‌ పాషా,సిబ్బంది బావ్‌సింగ్‌,తిరుపతి,సుమన్‌,సోమన్న,పూర్ణచారి,నవీన్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.