EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • OBCలకు 58 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే! మేమెంతో మాకు అంత:: “ఎంతో జనాభా ఉంటే… అంతే వాటా కావాలి” — హనుమకొండ OBC సమావేశంలో నాయకుల డిమాండ్

    Author
    Posted By JANA CHARITRA
    | 12 Sep 2026, 07:52 PM | TELANGANA, వరంగల్
    OBCలకు 58 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే! మేమెంతో మాకు అంత:: “ఎంతో జనాభా ఉంటే… అంతే వాటా కావాలి” — హనుమకొండ OBC సమావేశంలో నాయకుల డిమాండ్

    హనుమకొండ: OBCలకు జనాభా దామాషా ప్రకారం 58 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ హనుమకొండలో OBC సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. “ఎంతో మంది ఉన్నామో… అంతే వాటా కావాలి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ మా హక్కు — సామాజిక న్యాయం మా డిమాండ్” అని సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు.

    ఈ సమావేశంలో మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ మాజీ స్పీకర్ OSD గడ్డం భాస్కర్ ,గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్, వేణు మాధవ్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు, హైకోర్టు అడ్వకేట్ రాచకొండ ప్రవీణ్ కుమార్, ముదిరాజ్ నాయకులు అశోక్, పడ్మాజ దేవి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, OBCలు 58 శాతం ఉంటే, రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికన 58 శాతం కల్పించాలని డిమాండ్ చేశారు. OBCల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసేందుకు కులగణన నిర్వహించాలని కోరారు.

    ఇవి కూడా చదవండి

    జనాభా నిష్పత్తికి అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో OBCలకు న్యాయమైన వాటా కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. OBCలకు సామాజిక న్యాయం జరిగే వరకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు.

    ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో OBC నాయకులు, ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    “జనాభా దామాషా — సామాజిక న్యాయానికి మార్గం”

    జై OBC! జై సామాజిక న్యాయం!