EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కల్లెడ గ్రామoలోనీ VOA పోస్టు ను వెంటనే భర్తీ చేయాలి. *మాజీ రైతుబంధు మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్*

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Sep 2026, 10:57 PM | TELANGANA, వరంగల్
    కల్లెడ గ్రామoలోనీ  VOA పోస్టు ను వెంటనే భర్తీ  చేయాలి.  *మాజీ రైతుబంధు మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్*

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 28 :*
    పర్వతగిరి మండలం సోమవారం రోజున ప్రజావాణిలో ఎంపీడీవో వినతి పత్రం అందజేసిన మాజీ రైతు బంధు మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని జ్యోతి గ్రామైక్య సంఘంలో గతంలో VOA (Village Organization Assistant) గా విధులు నిర్వహిస్తున్న తక్కలపల్లి శ్రీనివాస్ గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందడం జరిగినది. ప్రస్తుతం కల్లెడ గ్రామ సర్పంచ్ గా ఎన్నికై విధులు నిర్వహిస్తున్నారు.
    సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నుండి, అనగా గత 9 నెలలుగా VOA పోస్టు ఖాళీగా ఉంది. దీని వలన గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు లావాదేవీలు, పుస్తకాల నిర్వహణ, ఇతర సంఘం పనులు నిలిచిపోయాయి.
    అంతే కాకుండా కల్లెడ గ్రామంలో అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు చాలా మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న జ్యోతి గ్రామైక్య సంఘం VOA పోస్టును వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి.పోస్టు ను భర్తీ చేయాలని సంబంధిత అధికారులను కోరనైనది. మహిళా సంఘాల సమస్యను పరిష్కరించగలరని కోరుచున్నాము.