EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుండె జబ్బులపై అవగాహన..ఉచిత ఓపీ,సీపీఆర్ శిక్షణ

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Sep 2026, 05:06 PM | TELANGANA, వరంగల్
    గుండె జబ్బులపై అవగాహన..ఉచిత ఓపీ,సీపీఆర్ శిక్షణ

    *తెలంగాణ,వరంగల్,సెప్టెంబర్ 29*

    హనుమకొండ: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఏకాశిల ఆస్పత్రి ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించింది.నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమేష్,మెడికల్ డైరెక్టర్,ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ అసిఫ్ ఇక్బాల్ ఎస్‌కే,జనరల్ మేనేజర్ శ్రీదేవి వివరాలు వెల్లడించారు.ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువతలో గుండెపోటు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యులు తెలిపారు.గుండెపోటు సంభవించినప్పుడు సకాలంలో ప్రథమ చికిత్స అందించడం ఎంతో కీలకమన్నారు.పేద,మధ్యతరగతి ప్రజలకు నిపుణులైన వైద్యుల సలహాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు ఉచిత ఓపీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ప్రాణాలను కాపాడే సీపీఆర్‌పై ఉచిత శిక్షణ గుండెపోటు సమయంలో సీపీఆర్‌ అందించడం ద్వారా అంబులెన్స్‌ వచ్చేలోపు బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని డాక్టర్ అసిఫ్ ఇక్బాల్ తెలిపారు.ప్రజల్లో సీపీఆర్‌పై అవగాహన పెంచేందుకు ఏకాశిల ఆస్పత్రిలో యువత,విద్యార్థులు,వాలంటీర్లు,సాధారణ పౌరులకు ఉచిత సీపీఆర్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఆసక్తి ఉన్న వారు ఆస్పత్రిలో పేర్లు నమోదు చేసుకుని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శిక్షణ పొందవచ్చన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని,ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ప్రాణాలను కాపాడే సీపీఆర్ వంటి అత్యవసర నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం సూచించింది.