EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సేవా సంకల్పంలో భాగంగా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ సందర్శన.

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Sep 2026, 10:04 PM | TELANGANA, వరంగల్
    సేవా సంకల్పంలో భాగంగా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ సందర్శన.

    వరంగల్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా నేడు ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్‌లోని జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్‌ను సందర్శించారు.

    ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధ మల్ల ఆనంద్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పాల్గొని హాస్టల్‌లోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల విద్య, వసతి, వారి ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

    విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని నాయకులు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని విద్యార్థులు, యువతకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందగట్ల మల్లికార్జున్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు బైరి మురళీకృష్ణ, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కర్నే రవీందర్,జిల్లా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.