EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 03:44 PM | TELANGANA, వరంగల్
    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

    వరంగల్, అక్టోబర్ 2:
    వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఆయన బోధించిన మార్గంలో నడవాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో డా. రాజమౌళి, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.

    ఇవి కూడా చదవండి