EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ .యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 04:07 PM | TELANGANA, నల్గొండ
    తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ .యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

    నేడు... నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం వేదికగా.. తెలంగాణ బ్రాహ్మణ ఐఖ్య వేదిక తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐఖ్య వేదిక సంయుక్తంగా.... తలపెట్టిన తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ .యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు...
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంచర్ల మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం ఉందని... మాతృత్వ మాధుర్యాన్ని పంచి పెట్టగలరు.. మరణానికి వెరవక, ఆయుధం చేపట్టిన చరిత్ర తెలంగాణ మహిళ లదని అన్నారు ... తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర చేపట్టటం ... చాలా మంచి కార్యక్రమం అని.. ఏ అసెంబ్లీ వద్ద మహిళా శాసనసభ్యులకు అవమానం జరిగిందో అక్కడ నుండే ఈ యాత్ర ప్రారంభిస్తే.. బావుంటుందని సూచించారు.
    గత కెసిఆర్ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అత్యంత ప్రాధాన్యత గౌరవం దక్కిందని 100 కోట్లతో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేశారని పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య కొరకు 20 లక్షలు ఇచ్చారని.. ధూప దీప నైవేద్య స్కీం కింద మొదట ఆరు వేలు ఆ తర్వాత పదివేలకు వారి గౌరవ వేతనాలు పెంచారని... కెసిఆర్ ప్రభుత్వ హాయంలో సంబండ వర్గాలు... సంతోషంగా ఉన్నాయని...
    కానీ దురదృష్టవశాత్తు నేడు... రౌడీ రాజ్యం నడుస్తుందని...
    బ్రాహ్మణ పరిషత్ కు... లాంటి వ్యక్తిని చైర్మన్ చేయడం అత్యంత దురదృష్టకరమని... ఇలాంటి వ్యక్తుల వల్ల.. వ్యవహార శైలి వల్ల అటు ప్రభుత్వము బ్రాహ్మణ సంఘాల పలుచనైపోతున్నాయని అన్నారు.
    తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐక్యవేదిక.. నువ్వు కలిసి చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష యాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని... ఉద్యమాల ఖిల్ల నల్లగొండ గడ్డపై నుండి.. ఈ యాత్ర ప్రారంభించడం మీకు విజయాన్ని చేకూరుస్తుందని.. అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి ఐక్యంగా ముందుకు పోవాలని.. తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు.
    తెలంగాణ బ్రాహ్మణ సమైక్య సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ దేవులపల్లి రంగారావు గంప రామ శర్మ కిరణ్ కుమార్ శర్మ, కంచనపల్లి రవీందర్రావు గుడా జయరావు,గూడా రాజేశ్వరరావు నారపరాజు రజనీరావు జ్యోతి కులకర్ణి చకిలం వేణుగోపాలరావు కందాల శ్రీనివాసాచార్యులు పసునూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.