EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లేబర్ కాలనీలో అబ్బానికుంట లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 05:14 PM | TELANGANA, వరంగల్
    లేబర్ కాలనీలో అబ్బానికుంట లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

    వరంగల్: గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ లేబర్ కాలనీలో కుడికాల శ్యామ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా చైర్మన్ బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సేవా, మానవతా మార్గాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని పేదలు, నిరుపేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవతా విలువలను మరింత పెంపొందించవచ్చని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, పాలక మండలి సభ్యులు కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, తోట సంపత్, పరశురాములు, కూచన రాములు, కార్యక్రమ నిర్వాహకులు కుడికాల శ్యామ్, డాక్టర్ లహరి, కుడికాల మహదేవ్, సురేందర్, మూడేడ్ల సతీష్, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    స్థానికులు, సేవాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు అభినందించారు.