EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి టీయూడబ్ల్యుజె(ఐజేయు)ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 10:02 PM | TELANGANA, వరంగల్
    జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి టీయూడబ్ల్యుజె(ఐజేయు)ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

    *తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 2*

    జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యుజె(ఐజేయు)జాతీయ కౌన్సిల్ సభ్యుడు సంగోజు రవి డిమాండ్ చేశారు.జాతీయ కమిటీ ఆదేశాలు,రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’ నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి,జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంగోజు రవి మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సదుపాయాలు కల్పించాలని,ప్రభుత్వ,ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం అమలు చేయాలని కోరారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,ఇళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ వాటి పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి అర్హులకు వెంటనే అందించాలని కోరారు.జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీరాం రామచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాతీయ,రాష్ట్ర నాయకత్వాల సూచనల మేరకు జిల్లా కమిటీలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.వరంగల్ జిల్లాలో వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.అందులో భాగంగానే మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను లిఖితపూర్వకంగా పేర్కొంటూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టుల సమస్యలను సత్వరం పరిష్కరించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో టీయూడబ్ల్యుజె(ఐజేయు)జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్,కోశాధికారి కొదాటి గోపాలకృష్ణ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీధర్,ఉపాధ్యక్షులు జన్ను స్వామి, కూర్ణ వెంకటేశ్వర్లు,మహాదేవుని జగదీష్,సహాయ కార్యదర్శులు బొమ్మగాని సతీష్,చింతనూరి రాజు,బాదావత్ బాలాజీ,కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పాషా,అక్రమ్, బాబర్, దేసు లక్ష్మణ్,కందుల శ్రీనివాస్,గాదె రవి,శీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.సీనియర్ జర్నలిస్టులు పెరుమాండ్ల మధు,ఎండీ సయీద్,సామల సూర్యప్రకాశ్,బలవారి విజయ్‌రాజ్,వలిశెట్టి సుధాకర్,ఎలుగందుల అజయ్ చిన్నబాబు,చైతన్య,షేక్ జావిద్,సాజిద్ పాషా,నితీష్,అమీర్,చిట్టిబాబు,మురళి,బేతి ఉమాశంకర్,సంతోష్,రాజేందర్,సాయి తదితరులు హాజరయ్యారు.