EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉర్సు జాగిర్ దర్గా వక్ఫ్ భూముల సర్వేను వెంటనే పునఃప్రారంభించాలి:జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 10:04 PM | TELANGANA, వరంగల్
    ఉర్సు జాగిర్ దర్గా వక్ఫ్ భూముల సర్వేను వెంటనే పునఃప్రారంభించాలి:జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ

    వరంగల్ బ్యూరో(శుక్రవారం,2 అక్టోబర్ 2026):ఖిలా వరంగల్ మండలం,ఉర్సు శివారులోని తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో ఉన్న వక్ఫ్ భూములకు సంబంధించి నిలిచిపోయిన సర్వేను తక్షణమే పునఃప్రారంభించాలని జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ ప్రభుత్వ అధికారులను కోరింది.ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్ (CP),మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వారు ప్రత్యేకంగా విన్నవించారు.
    *విషయం:*
    ఖిలా వరంగల్ మండలం పరిధిలోని ఉర్సు శివారు సర్వే నెంబర్లు 273,274,,275,276 లలో గల చారిత్రాత్మక వక్ఫ్ భూములకు సంబంధించి గతంలో సెప్టెంబర్ 17,2026 నాడు సర్వే ప్రక్రియ ప్రారంభమైంది.అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఆ సర్వే మధ్యలోనే ఆగిపోయింది.ఈ భూములు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని,వీటిని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని దర్గా కమిటీ పేర్కొంది.ఆగిపోయిన సర్వేను మళ్లీ ల్యాండ్ ఆఫీసర్,ఎమ్మార్వో(MRO),డి.ఆర్.ఓ(DRO)ఆధ్వర్యంలో మరియు పూర్తి స్థాయి పోలీసు రక్షణ(Police Protection)మధ్య సత్వరమే పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములు,వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని దర్గా కమిటీ కోరుతోంది.