EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాడవాడలా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 10:43 PM | TELANGANA
    వాడవాడలా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

    *తెలంగాణ వరంగల్ అక్టోబర్ 2*

    వరంగల్: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్,మేరా కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకటరాజం ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ ప్రాంతాల్లోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ చూపిన సత్యం,అహింస,శాంతి,సామరస్య మార్గాలను స్మరించుకున్నారు.మాజీ కార్పొరేటర్ బసవరాజు శిరీష శ్రీమాన్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద వేడుకలు ప్రారంభమయ్యాయి.అనంతరం మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ శివాలయం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎల్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుప్పాలగుట్టలో,బొలుగొడ్డు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో రంగసాయిపేటలో,యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షుడు ఎండీ సలీం,కుసుమ వరుణ్ ఆధ్వర్యంలో స్టేషన్‌రోడ్‌లోని గాంధీ విగ్రహాల వద్ద జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.ఆయా కార్యక్రమాల్లో నాయకులు,కార్యకర్తలు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాల్లో పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బసవరాజు కుమారస్వామి, కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు, మాజీ కార్పొరేటర్లు ధూపం సంపత్, దామెర సర్వేశం, తత్తరి లక్ష్మణ్, బిల్లా శ్రీకాంత్, జన్ను రవి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి, సోషల్ మీడియా కన్వీనర్ సోమలక్ష్మి, మహిళా నాయకురాలు గిరిగిరి పుష్ప, సేవాదళ్ నాయకులు మోహన్ రామ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.