EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రామన్నపేట లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన శ్రీమతి గుండు సుధారాణి

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Oct 2026, 08:14 PM | TELANGANA, వరంగల్
    రామన్నపేట లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన శ్రీమతి గుండు సుధారాణి

    మాహాత్మ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రోజున 29వ డివిజన్ రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొమ్మ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కాకతీయ పట్టనాభివృద్ధి సంస్థ (KUDA) చైర్ పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జి.డబ్ల్యూ.ఎం.సీ. మాజీ మేయర్ *"శ్రీమతి గుండు సుధారాణి"* గారు ముఖ్య అతిథిగా, ప్రత్యేక అతిథిగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్చార్జి, మాజీ డిప్యూటీ మేయర్ తక్కల్లపల్లి అశోక్ రావు గార్లు విచ్చేసి *మహాత్మా గాంధీ విగ్రహానికి* పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.

    ఈ సందర్భంగా *గుండు సుధారాణి* మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించాడని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

    ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవాలయం ధర్మకర్త ఓరుగంటి పూర్ణ, పార్టీ నాయకులు శ్రీరాముల సురేష్, సయ్యద్ రఫీక్, సిరిమల్లె చెన్నమల్లు, గొర్రె మహేష్, కె. నటేష్, చందర్, లోకేష్, పాక లక్ష్మణ్, సౌరం బాలకృష్ణ, రోషన్ గైక్వాడ్, ఎన్ N. శ్రీనివాస్, గద్వాల కృష్ణవేణి, సుతారి కళ్యాణి, కొలిపాక పద్మ, అరుణ, ఆర్పీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి