EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజాసంకల్ప సేవా బైక్ యాత్రకు ఘన సంఘీభావం

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Oct 2026, 08:15 PM | TELANGANA, వరంగల్
    ప్రజాసంకల్ప సేవా బైక్ యాత్రకు ఘన సంఘీభావం

    భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం మరియు ఆశయాలకు సంఘీభావంగా తిరుపతి నుంచి వారణాసి వరకు కొనసాగుతున్న ప్రజాసంకల్ప సేవా బైక్ యాత్ర వరంగల్ నగరానికి చేరుకున్న సందర్భంగా పోచమ్మ మైదానం సెంటర్‌లో యాత్రికులను కలిసి ఘనంగా శాలువా, పూలతో సత్కరించి,స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.

    ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ నాయకులు, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు జి.ఎల్. శ్రీదర్, నల్లకుంట రవికుమార్ , పరకాల నియోజకవర్గం బాధ్యులు కందుకూరి నరేష్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పొత్తురాజు అనిల్, మచ్చా లక్ష్మణ్ (ఆఫీస్ మేనేజర్) తదితరులు పాల్గొన్నారు.