EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Oct 2026, 11:17 PM | TELANGANA, వరంగల్
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు కురుమ కులమునకు చెందిన దొడ్డి కొమురయ్య విగ్రహమును వరంగల్ నగరంలో నెలకొల్పుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వస్తానని శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య అన్నారు శనివారం రోజున వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో బసవరాజ్ సారయ్య గారి స్వగృహంలో శాలువా కప్పి పూల మొక్కను అందజేసి వినతి పత్రం ఇచ్చినారు బడుగు బలహీన వర్గాలకు చెందిన దొడ్డి కొమురయ్య జననం 2027 ఏప్రిల్3 తారీకు కు 100 సంవత్సరాలు కావస్తున్నదని ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున వరంగల్ నగరంలో విగ్రహంను నెలకొల్పలేదని నేటి తరానికి ఆయన రూపురేఖలు తెలియని ప్రభుత్వం తరఫున దొడ్డి కొమురయ్య జయంతి వర్ధంతిలు నాలుగు గోడల మధ్యన జరుపుకుంటున్నారని ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా రంగ సాయి పేట నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వద్ద ఉర్సు గుట్ట జంక్షన్ వద్ద ఏదో ఒకచోట విగ్రహం ప్రతిష్టించి బహిరంగంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించాలని హంటర్ రోడ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వరకు గల ప్రధాన రహదారికి దొడ్డి కొమురయ్య పేరునునామకరణ చేయాలని కన్వీనర్ మరుపల్ల రవి శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య కు వివరించినారు శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య స్పందించి రహదారికి నామకరణ చేయడానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహా త్ వాజ్పాయ్ దృష్టికి తీసుకు వస్తానన్నారు వినతి పత్రం ఇచ్చిన వారిలో కురుమ సంఘం నాయకులు కోరె కృష్ణ చీర అశోక్ మండల హరీష్ కోరె నాగరాజు మిర్యాల కుమారస్వామి కోరే కుమార్ స్వామి మండల కొమురెల్లి మరుపల్ల గౌతం కుండె సదానందం దయ్యాల కృష్ణ గౌడ కోటేశ్వర్ గొట్టే సదానందం మండల శ్రీను తదితరులు ఉన్నారు