EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రామప్ప పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిలిపివేయాలి: మడిపెల్లి నాగరాజు గౌడ్

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Oct 2026, 10:59 PM | TELANGANA, వరంగల్
    రామప్ప పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిలిపివేయాలి: మడిపెల్లి నాగరాజు గౌడ్

    వరంగల్: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓపెన్ కాస్ట్ మైనింగ్, బొగ్గు తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని బీజేపీ ఎండోమెంట్స్ ధార్మిక సెల్ వరంగల్ జిల్లా కన్వీనర్ మడిపెల్లి నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల భూ ప్రకంపనలు, కంపనాలు ఏర్పడి రామప్ప ఆలయ నిర్మాణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
    ఈ మేరకు మడిపెల్లి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వరంగల్ కాశిబుగ్గలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం ఆలయం వెలుపల నిరసన తెలిపారు. రామప్ప దేవాలయం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తింపు కలిగిన కట్టడమని పేర్కొన్నారు.
    రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో మైనింగ్, బొగ్గు తవ్వకాలు కొనసాగితే భూగర్భంలో ప్రకంపనలు ఏర్పడి శిల్పకళకు, ఆలయ నిర్మాణానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వేల సంవత్సరాల చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
    మైనింగ్ కార్యకలాపాల వల్ల రామప్ప ఆలయ భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సంబంధిత అధికారులు శాస్త్రీయంగా పరిస్థితిని పరిశీలించి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్, బొగ్గు తవ్వకాలను నిలిపివేయాలని మడిపెల్లి నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు.
    ఈ నిరసన కార్యక్రమంలో ఎండోమెంట్స్ ధార్మిక సెల్ సభ్యులు నరేందర్, కోట రాజ్ కుమార్, చిలుకూరి ఉమతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.