EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పట్టభద్రులారా.. నీ ఓటును నమోదు చేసుకోండి..మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Oct 2026, 11:03 PM | TELANGANA, వరంగల్
    పట్టభద్రులారా.. నీ ఓటును నమోదు చేసుకోండి..మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్

    *పట్టభద్రులారా.. నీ ఓటును నమోదు చేసుకోండి.. మీ గొంతును బలంగా వినిపించండి*

    *కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు.. గ్రాడ్యుయేట్లు తమ ఓటుతో సమాధానం చెప్పాలి:*

    *గ్రాడ్యుయేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్*

    ఇవి కూడా చదవండి

    పర్వతగిరి , అక్టోబర్ 5:
    జన చరిత్ర న్యూస్
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో వర్ధన్నపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు.
    వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి పట్టభద్రులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పర్వతగిరి మండల పట్టభద్రుల ఓటర్లకు గ్రాడ్యుయేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ పిలుపు
    నిచ్చారు.
    ​ 01-11-2023 నాటికి కనీసం మూడేళ్ల క్రితం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలను జతచేసి AERO / తహసీల్దార్ లేదా సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు.
    ​ఆన్‌లైన్ నమోదుకు ఆసక్తి ఉన్నవారు తెలంగాణ సీఈఓ అధికారిక వెబ్‌సైట్ (ceotelangana.nic.in) ద్వారా దరఖాస్తు నవంబర్ 6 వ తేదీ వరకు చేసుకోవచ్చు అని తెలిపారు.
    ​కొత్తగా నమోదు తప్పనిసరి: పాత ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకోని తన ఓటును నమోదు చేసుకోవాలని గ్రాడ్యుయేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ కోరారు.
    పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, విద్యా రంగ సమస్యలపై బలమైన గొంతును వినిపించేందుకు మీ ఓటు ఎంతో కీలకం అని చిన్నపాక శ్రీనివాస్ తెలిపారు.
    అర్హత ఉన్న ప్రతి పట్టభద్రులు ఆలస్యం చేయకుండా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
    అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని,నిరుద్యోగ భృతి అందిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరుద్యోగ యువత భవిష్యత్తుకు,పట్టభద్రుల ఆకాంక్షలకు సంబంధించిన ప్రజా తీర్పు అని,తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పట్టభద్రులకు ఉందని,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ముందుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం అత్యంత ముఖ్యమని చిన్నపాక శ్రీనివాస్ కోరారు.