EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్ : ప్రమాదకరంగా డ్రైనేజీ గుంత!

    Author
    Posted By AKULA MADHU
    | 06 Oct 2026, 12:31 PM |
    చౌటుప్పల్ : ప్రమాదకరంగా డ్రైనేజీ గుంత!

    చౌటుప్పల్ : స్థానిక 14 వ వార్డులో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ గుంత? వివరాలలోకి వెళితే 14 వ వార్డులో యాక్సిస్ బ్యాంకు పక్కన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపక్కన నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. డ్రైనేజీపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్లాబ్ మధ్యలో విరిగిపోయి, పెద్ద గుంతలా తెరుచుకుని ఉంది. దారికి సరిగ్గా మధ్యలో ఈ గుంత ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలినడకన వెళ్లే స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
    రాత్రి వేళల్లో సరిపడా వెలుతురు లేకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు, చిన్న పిల్లలు, వృద్ధులు ఈ ప్రమాదకర గుంత ఉంది. ఒకవేళ వర్షం వస్తే నీరు నిలిచి ఈ గుంత స్పష్టంగా కనిపించక పరిస్థితి మరింత దారుణంగా మారనుంది.
    ​అధికారులు స్పందించాలి:
    ఇంత పెద్ద ప్రమాదం కళ్ళముందే కనిపిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.